నిప్పులాంటి నిజం!

My blogs

About me

Location హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, India
Introduction ఈ బ్లాగ్ ఎంతటి ప్రజాదరణ పొందిందో మీకు చెప్పాల్సిన పనిలేదు. ప్రారంభించిన కేవలం 3 నెలల్లోనే దీనికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పాఠకుల ఆదరణ లభించడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం. ఇంటర్నెట్లో ఇప్పటికే ఎన్నో ఉన్న ఇలాంటి బ్లాగ్లుల మధ్య మా సైట్ పాఠకాదరణ పొందడం మాటల్లో వర్ణించలేం. తప్పుచేసిన వారు ఎవరన్నా, ఎంతటి వారన్నా మాకు సమానమే. అన్ని రంగాలకు మాదిరిగానే పాత్రికేయ వృత్తిలో కూడా అవినీతి, అరాచకం ఎక్కువైంది. ఇతర రంగాలకు మాదిరిగా ఇక్కడ నిఘా కొరవడడాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొంతమంది దగుల్భాజీలు జర్నలిజమనే పవిత్రమైన వృత్తిని అడ్డంపెట్టుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. నిరంతరం నిఘా వేసి, రిపోర్టర్లను దారిలో పెట్టాల్సిన సబ్ ఎడిటర్లు "సబ్బు ఎడిటర్లు"గా అవతరించి తమకు తోచిన రీతిన సముపార్జించుకుంటున్నారు. ఈ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే "/జర్నలిస్ట్స్ ఎన్కౌంటర్" బ్లాగ్. మా ఆశయానికి ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. బ్లాగ్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మేం రాష్ట్రంలోని మొత్తం 35 మంది అక్రమార్కుల బాగోతాలను బట్టబయలు చేసి, వాళ్లకు తగిన గుణపాఠం చెప్పించగలిగాం. వారిలో 12 మంది ఉద్యోగాలు పోయాయి. ఇంతకన్నా మేం సాధించిన విజయం ఏముంటుంది చెప్పండి? ఈ సైట్ను మరింత ఆకర్షణీయంగా, విశ్వసనీయ సమాచార సమూహంగా తీర్చిదిద్దేందుకు మీవంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. మీ, శ్రేయోభిలాషి.