tag:blogger.com,1999:blog-15116243190440463522009-07-14T21:54:28.688+05:30రవీయంరవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.comBlogger24125tag:blogger.com,1999:blog-1511624319044046352.post-80724614691818154382009-07-05T19:44:00.013+05:302009-07-09T22:06:23.378+05:30మా ఊరిలో వధువుల కొరతమగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువై పోవటంవల్ల వధువుల కొరత ఏర్పడుతున్న విషయం,"పెళ్ళికాని ప్రసాద్ " లు పెరుగుతున్న విషయం అప్పుడప్పుడు మన చెవిన పడుతున్న విషయాలే. కాని ఈ పరిస్థితి అక్కడెక్కడో మాత్రమే కాదు మా ఉరిలో కూడా వచ్చిందని వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. నిన్న మా ప్రక్కవీధి లో ( పేర్రాజు చౌదరి కుమార్తె ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నది ) అబ్బాయి తండ్రి , అమ్మాయి తండ్రికి రూ.8౦,౦౦౦.౦౦ ముందే ఇచ్చేలా సంవత్సరం తరువాత పెళ్లి చేసేలా ఒప్పందం జరిగిందని తెలిసి వింతగా చెప్పుకుంటున్నారు.కట్నాల రేట్లు బాగా తగ్గాయని నాకు తెలుసు కానీ మరీ ఎలా ఎదురు డబ్బు తీసుకుని పెళ్లి చేసే రోజులొచ్చాయని తెలిసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. పరిస్థితులెంత వేగంగా మారిపోతున్నాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ముందు ముందు కన్యాశుల్కం రోజులు మళ్ళీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.

ఈ పరిస్థితులని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సంగతులు తెలుస్తున్నాయి.వరుల కోసం వెతుక్కునే పని పోయి వచ్చిన సంబందాలలో మంచివాటిని ఎంచుకొనే అవకాశం వీరికి వచ్చింది. పైగా వీరే మగపిల్లల తల్లిదండ్రులకి షరతులు పెడుతున్నారు. ఈ మధ్య ఒకాయన తన కుమార్తెకి సంబంధం కుదుర్చుకునేటప్పుడు, ఉమ్మడి కుటుంబంలోని కాబోయే అల్లుని వాటాకు వచ్చే ఆస్తులు వగైరా తెగ్గొట్టి అతనికి వచ్చే వాటిని అతని పేరు మీదకు మార్పిడి చేస్తేనే కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేస్తానని షరతు పెట్టాడట. అలా చేసాకే పెళ్లి చేసాడని తెలిసింది.

పెళ్లీడు కొచ్చిన మగ పిల్లల తల్లిదండ్రులు మధ్యవర్తుల ద్వారా పైరవీలు నడుపుతూ ఆడపిల్లల తల్లిదండ్రులు తమవైపు వచ్చేలా చేసుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ మధ్య ఇంకో వార్తా ఏమిటంటే , కట్నం లేకుండా పెళ్లి అయిందని చెప్పుకోవటం నామోషి అనిపించి ఒకాయన తెరచాటున కొంత డబ్బు , బంగారం ముందుగానే అమ్మాయి తల్లిదండ్రులకి ఇచ్చి , వాటినే పబ్లిక్ లో బంధువుల మధ్య కట్నంగా తీసుకోవటం జరిగిందట.

మా ఊరిలో ఒక్క సామాజిక వర్గానికి చెందిన యువకులే దాదాపుగా 3౦ ఏళ్ళు దాటిన వారు కనీసం 5౦ , 6౦ మంది ఉంటారు. అందరూ మధ్య తరగతి స్థాయి నుండి సంపన్నుల స్థాయికి చెందినవారే. కాని అమ్మాయిలు 25 సం. దాటిన వారు 5 ,6 గురు కూడా లేరు. దీనిని బట్టి వధువుల కొరత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నా స్నేహితుడు ఒకడు మాటల సందర్భంలో " నేను చిన్నవాడైనా మా అమ్మాయి పెళ్లి కంటే ముందు అబ్బాయి పెళ్లి చేస్తా, ఎందుకంటే ముందే అమ్మాయి పెళ్లి చేసేస్తే ఇంక మా అబ్బాయి మొహం చూసే వారుండరేమో కదా ! అమ్మాయిని అడ్డం పెట్టుకుని అబ్బాయి పెళ్లి కానిస్తే తరువాత అమ్మాయి పెళ్లి ఎలా అయినా చేసెయ్యొచ్చు లేదా కుండ మార్పిళ్లు ట్రై చెయ్యొచ్చు " అన్నాడు. ఇంతవరకు ఇంట్లో ఉన్న ఆడపిల్ల చిన్నదైనా పెద్దదైనా ముందు పెళ్లి చేసేసి రిలీఫ్ ఫీలయ్యి తరువాత తాపీగా అబ్బాయి పెళ్లి చేయటం చూస్తున్నాం. ఇక ముందు కుటుంబంలో మగపిల్లవాడికి ముందు పెళ్లి చేసేసి గుండెల మీద కుంపటి తొలగించు కుంటారన్నమాట.

ఏమైనా ఆడపిల్లల పట్ల వివక్ష పూర్తిగా తొలగి ఆడపిల్లల సంఖ్య మగవారి సంఖ్య తో సమానమైతే తప్ప ఈ పరిస్థితి మారదు. అప్పుడు మాత్రమే సమాజం కన్యాశుల్కం నుంచి వరకట్నం లోకి, వరకట్నం లోంచి కన్యాశుల్కం లోకి మారటం కాకుండా ఈ రెండు లేని స్థితి దగ్గర ఆగుతుందని నా ఉద్దేశ్యం.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com1tag:blogger.com,1999:blog-1511624319044046352.post-88910036100407164102009-04-14T21:53:00.004+05:302009-04-16T21:04:58.436+05:30ఇదొక రకం అవయవ వ్యాపారం.
ఇవి సప్త మహా ఋషులలో ముగ్గురైన వశిస్ట, విశ్వామిత్ర, జమదగ్ని ల కాంస్య విగ్రహాలు.వీటి ఈ దుస్థితి కి కారణం వీటి తయారీకి వాడిన లోహమేనని అర్ఢమవుతుంది.

బహుశ 2002 లో అనుకుంటా 2003 లో జరగబోయే గోదావరి పుష్కరాల నిమిత్తం కొవ్వూరు వైపున గోదావరి ఒడ్డున కొన్ని సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా సప్త మహా ఋషుల కాంస్య విగ్రహాలను ఆనాటి ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి తయారుచేయించి గోష్పాదక్షేత్రం పొడవునా రోడ్డు ప్రక్కగా ప్రతిష్టింపచేసింది.

ఖరీదైన లోహాల మిశ్రమం తో తయారవటం చేత దొంగల కళ్ళు పడి ఈ ముగ్గురు విగ్రహాల చేతులూ, కమండలాలూ వగైరా మాయమైపోయాయి. విగ్రహాల అవయవాలను కరిగించి అమ్ముకోవటమే వ్యాపారంగా గల దొంగల పనే ఇది. నిత్యం 24 గంటలూ వేలాది వాహనాలూ జనులూ సంచరించే ప్రాంతం అయినా ఇలా విగ్రహాల అవయవాలను ఖండించి తీసుకు పోగలగటం నాకిప్పటికీ ఆశ్చర్యమే. పుష్కరాలు జరిగిన తరువాత సంవత్సరంలోపే ఇదంతా జరిగిపోయింది.
విచిత్రమేమిటంటే ఇది జరిగి సుమారు 6 సంవత్సరాలైనా ఇప్పటివరకూ ఈ విగ్రహాల పరిస్థితి అలాగే వుంది.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-81138191356306948742009-04-06T22:13:00.005+05:302009-04-11T22:24:37.965+05:30స్నేహితురాలి జాతకంరామసీత అని మా చెల్లెలి క్లాస్ మేట్ ఒక ఆవిడ (నాకు కూడా స్నేహితురాలే) ఇవాళ మా ఇంటికి వచ్చింది.కొన్నాళ్ళ క్రితం తనకు బాగా జబ్బు చేసింది.రెండు కిడ్నీలూ పాడయిపోయాయి.బ్రతకటం కష్టం అన్నారు డాక్టర్లు. అల్లాంటిది వాళ్ళ అక్క ఒక కిడ్నీ ఇవ్వటంతో బ్రతికింది. ఈ విషయం తెలిసిన తరువాత ఒకరోజు తన ఇంటికి పరామర్శ కని వెళ్ళాను. కాని తను వాళ్ళ అత్తగారి వూరు వెళ్ళటంతో కలవలేకపోయాను. తనే ఇవ్వాళ మా ఇంటికి వచ్చింది.

పరామర్శలో భాగంగా తనకు కలిగిన అనారోగ్యం గురించి అడిగాను. అన్నీ వివరంగా చెప్పింది.

తను చెప్పిన మాటలను బట్టి , మొదట్లోనే కనిపించిన అనారోగ్య లక్షణాలని సరిగా గుర్తించలేక తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేదేమో అనిపించింది నాకు. డాక్టర్లు కూడా మొదట్లో ఇంతటి ఉపద్రవాన్ని వూహించలేకపోయారనే చెప్పొచ్చు. ఏమైతేనేం 2 కిడ్నీలూ పాడయిపోయాయి అని చెప్పారట. చివరకు ఎవరైనా రక్త సంబందీకులు కిడ్నీ ఇస్తే తప్ప బ్రతకదని డాక్టర్లు తేల్చారట. అందాక డయాలసిస్ తో బ్రతకాలన్నారట . ఆ పరిస్థితుల్లో తన ఇద్దరు అక్కలు నేను , నేనంటూ కిడ్నీ ఇవ్వటానికి ముందుకు వచ్చారట. చివరకు అనేక ఇబ్బందులు (బ్లడ్ గ్రూప్ సరిపోలక ఒక అక్కనీ , షుగర్ వ్యాధి ఉండటం వల్ల ఒక అక్కనీ డాక్టర్లు నిరాకరించటం , బ్రోకర్ల ద్వారా కిడ్నీ కోసం ప్రయత్నించి మోసపోవటం వగైరా)ఎదుర్కున్న తరువాత మరొక అక్క కిడ్నీ ని తీసి తనకు అమర్చి బ్రతికించారట.

ఈ మొత్తం ఉదంతం సుమారుగా 7,8 నెలలు నడిచింది. ఈ క్రమంలో 3,4 సార్లు ఇక లాభం లేదు ,పేషంటు బ్రతకటం కష్టం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని కూడా డాక్టర్లు అన్న సందర్భాలు వచ్చాయట. లక్షలకొద్దీ డబ్బు ఖర్చు అయిపోయిందట.

నేనప్పుడు అడిగా అంతటి నిరాశాపూరిత పరిస్థితినెలా ఎదుర్కొన్నావు? అప్పటి నీ మానసిక స్థితి ఎలా వుందీ? ఆ బాధని ఎలా తట్టుకున్నావు? అని.

అపుడు , ఇంటర్ చదివే రోజులలో తను కలిసిన జ్యోతిష్కుని గురించి, అతను చెప్పిన జాతకం గురించీ చెప్పింది. ఆ జ్యోతిష్కుడు తన చేయిని చూసి , నీకు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యం కలుగుతుంది.ఎవరికీ బ్రతుకుతావని ఆశ లేకుండా పోతుంది. కాని పొట్టకు పెద్ద శస్త్ర చికిత్స చేస్తారు. చికిత్స విజయవంతమవుతుంది.నువ్వు బ్రతుకుతావు. జీవితాంతం నీబాధ్యతలు నెరవేరుస్తావు అని చెప్పాడట. ఆ జ్యోతిష్కుని మాటలు తనకు టానిక్ లా పని చేసాయని తను తప్పనిసరిగా బ్రతుకుతానని నమ్మకంతోనే చివరిదాకా వున్నానని చెప్పింది. అలానే బ్రతికింది.

ఏమైతేనేం వైద్యం వల్ల బ్రతికిందో , జాతకమ్మీద తనకున్న విశ్వాసమే తనను బ్రతికిచిందో మొత్తం మీద బ్రతికింది. జ్యోతిష్కుని మాటలు నిజమయ్యాయి.

ఇదొక్కటే కాదు గతంలో కూడా జాతకం నిజమైన సందర్భాలు 2,3 ఎరుగుదును. చాలా సార్లు నిజం కాకపోవటాన్ని కూడా చూశాను. ఎన్నోసార్లు నిజం కాకపోవటమనేది ఒకసారి నిజం కావటం లోని సత్యాన్ని తీసివేయలేదు కదా!. ఇలాంటి సందర్భాలలోనే జాతకాలని నమ్మం అని వాదించే బదులు , అవును జాతకాలు అప్పుడప్పుడూ నిజమవుతూ ఉంటాయి, భవిష్యత్తును తెలుసుకొనే శక్తి కొంతమందికి ఉంటుంది అని ఒప్పుకోవటమే మంచిదని అనిపిస్తుంది నాకు.

ఈ మొత్తం ఉదంతంలో నన్ను కదిలించిన మరో అంశం అక్క చెల్లెళ్ళ మధ్య అనురాగం. తమ తమ భర్తల అనుమతి లేదనో మరోటో చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నా తన అక్కలందరూ అలాంటిదేమీ చేయకుండా కిడ్నీ ఇవ్వటానికి సంసిద్దత తెలిపి మెడికల్ టెస్ట్ లకు హాజరు కావటం నిజంగా నన్ను కదిలించింది.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-73009611814499309752009-03-02T23:28:00.003+05:302009-03-02T23:49:53.785+05:301400 మెగా పిక్సెల్ఇదొక అద్భుతమైన ఫొటొ. ఒబామా ప్రమాణస్వీకారం సదర్భంగా 1.2 గిగా పిక్సెల్ కెమెరా తో తీసినది. అంటే 1400 మెగ పిక్సెల్స్ తో సమానమన్న మాట. లింక్ క్లిక్ చేసినప్పుడు స్థూలంగా మొత్తం పిక్చర్ వస్తుంది. తరువాత ఎడమ ప్రక్కనఉన్నస్కేల్ & కీ ల అధారంగా ఎన్లార్జ్ చేసే కొద్దీ అప్పటివరకూ మనం గుర్తించలేని ఒబామా నూ,బుష్ నీ, క్లింటన్ నీ అందర్నీ చూడవచ్చు . పిక్చర్ క్లియర్ అవటానికి కొంచం టైం తీసుకుంటుంది.
కానీ ఆ క్లారిటీ చూసి మరియు పిక్చర్ పరిమాణాన్ని ఊహించి ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం.

ఆ ఫోటో కోసం ఇక్కడ http://gigapan. org/viewGigapanF ullscreen. php?auth= 033ef14483ee8994 96648c2b4b06233c  క్లిక్ చేయండి.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-63432837762547845372009-02-17T22:00:00.002+05:302009-02-17T22:07:39.070+05:30మా ఇంటి పందికొక్కుమా ఇంటి పెరట్లో ఈ మధ్య ఒక పెద్ద పందికొక్కు తిరుగుతుంది . మనుషులంటే ఏ మాత్రం లెక్క లేకుండా పట్ట పగలే తిరుగుతూ కాళ్ళకు అడ్డం పడుతుంది. డ్రైనేజ్ లో ఆహారం కోసం వెతుక్కుంటూ, దొరికిన ఆహారాన్ని తింటూ తిరుగుతుంది . ఒక రోజు అది అలా తింటుండగా చేతిలో ఉన్న సెల్ ఫోన్ కెమెరా తో చిత్రీకరించాను. చేతితో తీసుకుని మరీ తింటూ స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ చూడండి.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-78166940385938742262008-11-13T22:36:00.004+05:302008-11-13T22:58:41.331+05:30అంగుత్తరనికాయబ్లాగ్ వ్రాసి చాలా కాలం అయిపోయింది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వ్రాద్దామనుకుంటుండగానే కాలం అలా గడిచిపోతూ ఉంది.

ఇవాళ ఏమైనా సరే ఏదో టపా వ్రాసి పోస్ట్ చేద్దామనే వుద్దేశ్యంతో పట్టుదలగా కాగితం ,పెన్ను పట్టుకుని కూర్చున్నాను.
ఏమి వ్రాద్దామా ? అని ఆలోచన మొదలైంది .ఎన్నో భావాలు వస్తున్నాయి . పోతున్నాయి. . ఒక దానికి విరుద్ధంగా మరొకటి. ఏదో వ్రాయ బోవడం , కొట్టివేయడం జరుగుతుంది .

ప్రతీ మనిషి లోనూ అనేక భావాలు రావడం పోవడం సహజమే కావచ్చు. కాని నా అనుభవమేమిటంటే ఏదైనా వ్రాద్దామని కూర్చున్న సమయంలోనే మిగతా సమయాల్లో కంటే ఎక్కువ భావాల చలనం వుంటుంది. .రచయితలు అందరూ కాకపోయినా కొందరైనా ఇలాంటి ఇబ్బందిని ఎరిగి వుంటారని నా వుద్దేశ్యం .

ఎంతసేపు కూర్చున్నా ఏదీ తేల్చుకోలేకపోయా.

ఈ తర్జన భర్జనకు త్వరగా ముగింపు పలికి ఏదో ఒకటి వ్రాద్దామనే సంకల్పంతో ఉపాయం తట్టక పోతుందా అని పాత డైరీ ఒకటి తిరగేసా . అందులో ప్రతి మనిషి నిరంతరం మననం చేసుకోవలసిన విషయాలుగా గౌతమ బుద్దుడు చెప్పిన "అంగుత్తరనికాయ" సారాంశం కనబడింది .ఎందులో చదివి వ్రాసుకున్నానో గుర్తులేదు కాని నాకు బాగానచ్చింది . ఇక ఆలోచన కట్టిపెట్టి అదే టపా గా వ్రాసి పోస్ఠ్ చేస్తున్నా . చదువుతారని ఆశిస్తా.

అంగుత్తరనికాయ
ప్రతీ మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు.
1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది .దాన్ని నేను తప్పించుకోలేను.
4. నేను అమితంగా ప్రేమించి, నావి అని భావించే వస్తువులు , సంపద , ఆస్థి అన్నీ ఏదో ఒక రోజున మార్పుకు, నాశనానికి, లేదా ఎడబాటుకు లోనయ్యేవే . దాన్ని నేను తప్పించుకోలేను.
5. నేను చేసిన పనుల [ స్వకర్మల ] పలితంవల్లే నేను ఇలా తయారయ్యను . నా పనులు ఎటువంటివైనా, మంచివైనా చెడువైనా - వాటీకి నేను వారసుణ్ణి కావలసిందే.

అనారోగ్యాన్ని గుర్తుంచుకోవటం ద్వారా ఆరోగ్యం వలన కలిగే అహంకారాన్నీ, వృద్ధాప్యాన్ని గుర్తుంచుకోవటం ద్వారా యవ్వనం వలన కలిగే అహంకారాన్ని, మృత్యువును ధ్యానించటం ద్వారా జీవన విధానం వలన కలిగే అహంకారాన్ని, ప్రతి వస్తువులో కలిగే మార్పునీ, నాశనాన్ని ధ్యానించటంద్వారా, అన్నీ నాకే కావాలనే బలమైన కోరికను అణిచివేయవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు .మనం చేసే పనుల ఫలితాన్నే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని మననం చేసుకోవటం ద్వారా ఆలోచనలలో, మాటలలో, పనులలో చెడు చేయాలనే దుర్మార్గ స్వభావం అణగారుతుంది. కనీసం తగ్గుతుంది.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com5tag:blogger.com,1999:blog-1511624319044046352.post-79227145931271376672008-06-29T20:04:00.003+05:302008-06-29T20:49:48.958+05:30కీడు లో మేలు
ఆంధ్ర జ్యోతికి, ఎమ్మార్పీఎస్ కి మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలు చాలా విచారకరం. ఆలోచిస్తుంటే కీడులో మేలులా ,ఇది కూడా ఒకందుకు మంచిదే అనిపిస్తుంది నాకు.

పత్రికలు,మీడియా వారన్నా, ఎస్ సి,ఎస్ టి లన్నా చాలామంది ప్రజలు భయపడే స్థాయికి వారిని వారి నాయకత్వాలు కాని, యాజమాన్యాలు కాని తీసుకెళ్ళాయి. రాజ్యాంగం వెసలుబాటు అలా వుంది మరి. పత్రికా స్వేచ్చ హక్కు ద్వారా ఏది పడితే అది ఎలాపడితే అలా , ఆధారాలున్నా లేకపోయినా వ్రాసే అధికారం చేజిక్కించుకున్నారు పత్రికల వారు."బాడుగ నేతలు" కధనం ఒకటే కాదు. ఈ మధ్య జరిగిన పొట్టిలంక సంఘర్షణలో కూడా వీరి పోకడ గమనించవచ్చు. కొన్ని పత్రికలూ,చానెళ్ళూ అగ్రవర్ణాల దాడీ అంటూ అన్నీ కవర్ చేశారు కాని, అలా ఎందుకు దాడి చేసారు? అనే ప్రశ్నకు సమాధానం సరిగా లేకుండా చేసారు. బహుశ వార్తకు బరువు రావాలంటే ఆ సస్పెన్స్ అలా మెయిన్ టెయిన్ చేయాలేమో! అధారాలేమీ లేకున్నా వ్రాయగలరు. అలాగే వాస్తవాల్ని ఉద్దేశ్యపూర్వకంగా మరుగుపరచనూగలరు. (అమ్మాయిని పబ్లిగ్గా ముద్దుపెట్టుకున్నంత మాత్రాన దాడి చేయాలనికానీ, మనిషిని చంపేయాలని కానీ చెప్పడం నావుద్దేశ్యం కాదు .గమనించాలి.)

ఇక గ్రామాల దగ్గర నుంచి పట్టాణాల దాకా మిగిలిన కులాలవారు ఎస్ సి,ఎస్ టి లంటే భయపడే స్థాయికి ఎట్రాసిటీ కేసులద్వారా (చాలాసార్లు దుర్వినియోగపర్చడంద్వారా ) వారిని వారి నాయకత్వాలు తీసుకెళ్తున్నాయి. ఇలాగే సాగితే ముందుముందు వారితో లావాదేవీలన్నా ,వ్యవహారాలన్నా, వ్యాపారాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. చివరికి ఇదొకరకమైన అంటరానితనంగా మారినా మారవచ్చు. ఆ పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఈ కుల సంఘాల నాయకుల్నే బాధ్యులని చెయ్యాలి.

ఎవరికి వారుగా పత్రికలవారితో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవటం కానీ, ఎట్రాసిటి వగైరా చట్టాలను గురించి ప్రశ్నించటం టం కాని అయ్యే పని కాదు. బలమైన ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం వల్లనైనా ఈ రెండిటి గురించి ప్రజల్లో చర్చ జరగడం మొదలయ్యింది . పోగా పోగా భవిష్యత్తులో ఏదైనా మంచి మార్పు రావటానికి ఇది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-77950379168005349922008-05-15T21:56:00.004+05:302008-05-21T21:45:50.823+05:30విద్యార్ధి కింత కష్టం కలిగించింది ఎందు కో"సం"ఈ మధ్య "నవతరం" లో "చదువులా చావులా " చూసిన తరవాత అంతకు ముందు ఎప్పుడో నాకు వచ్చిన ఒక ఇ-మెయిల్ గుర్తుకొచ్చింది. ఎక్కడినుంచి మొదలు పెట్టిందో ఏమో నా మేనల్లుడు పంపిన ఇ-మెయిల్ ద్వారా నాకూ చేరింది ఈ జవాబు పత్రం. చూడగానే మనసంతా ఏదోలా అయ్యింది. మీరూ చూడండి.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com1tag:blogger.com,1999:blog-1511624319044046352.post-20015619242992632292008-05-02T22:52:00.001+05:302008-05-02T22:59:30.330+05:30రామోజీ గారికి సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎందుకు పడేది కాదు?ఈ రోజు "సాక్షి" సంపాదకీయం లో ఈటీవీ ప్రస్థావన వచ్చింది.ఈటీవీ ప్రసారం చేసే సినిమాల్లో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన సినిమాలు ప్రసారం చేయాల్సి వస్తే ఆ సినిమా టైటిల్స్ నుంచి దాసరి నారాయణ రావు పేరు లేకుండా చేసి మరీ ప్రసారం చేసే వారట. ఇది నేను గమనించలేదు కాని గతంలో నేను గమనించిన విషయం ఒకటుంది అది ఏమిటంటే....

80 ల్లో సూపర్ స్టార్ గా వున్న కృష్ణ పట్ల ఎందుకు ద్వేషం పెంచుకున్నారో ఏమో రామోజీరావుగారు అప్పట్లో తమ పత్రికల్లో ఎక్కడా ఆయన పేరు కాని ఫోటో కాని రాకుండా జాగ్రత్త పడేవారు. ఆయన సినిమా పత్రిక అయిన సితార లో కూడా అప్పటికి ఎంతో ప్రజాదరణ తో హీరో గా వున్న కృష్ణ పేరును కాని, ఫోటోను కాని ప్రచురించే వారు కాదు. ఈ నిషేధాన్ని చాన్నాళ్ళు పాటించారు. తరువాత మెల్లగా నిషేధాన్ని తొలగించారు. బ్లాగర్లలో కొంతమందికైనా ఈ విషయం తెలిసే వుంటుంది.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com9tag:blogger.com,1999:blog-1511624319044046352.post-29936863970694132692008-04-06T22:10:00.002+05:302008-04-06T22:41:26.340+05:30హోమియోపతి పట్ల స్నేహితుని అభిప్రాయంతమకు తోచిందీ,నమ్మేదీ తప్ప మరొకరేం చెప్పినా వినని వారు కొందరుంటారు. మా ఫ్రెండ్ ఒకడికి హోమియోపతి మీద అసలు నమ్మకం లేదు. ఎందుకో తెలియదు కానీ ఈ విధానం ద్వారా ఏ జబ్బూ తగ్గే పనే వుండదు అంటూ వాదిస్తూ ఉంటాడు.హోమియోపతితో తనకు ఏమన్నా చేదు అనుభవం ఉందేమో అందుకే ఈ అభిప్రాయానికి వచ్చాడేమో అనుకున్నా. అలాంటిదేమీ లేదని తెలిసింది. సరైన కారణం లేకుండానే కొన్నిటి మీద సదభిప్రాయం మరికొన్నిటిమీద దురభిప్రాయం కలగటం సహజంగా జరిగేదే కదా. అలాగే వీడికి హోమియోపతి మీద దురభిప్రాయం కలిగి ఉంటుంది. సరిగా వివరించి చెబితే తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడేమో అనిపించి ఈ మధ్య ఒకసారి ప్రయత్నించి చూశాను.

హోమియోపతి పితామహుడు "డాక్టర్ హానిమన్ " కన్నా ముందే అల్లోపతి కి కూడా ఆద్యుడైన " హిప్పోక్రటిస్ " హోమియోపతి మూలసూత్రమైన " సరూపాలతో సరూపాలను నివారించాలి " అనేవిషయాన్ని కనిపెట్టాడనీ , ఏ పదార్ధమైతే స్థూలమొత్తం లో తీసుకొంటే రోగాలను కలిగిస్తుందో అదే పదార్ధం సూక్ష్మ మోతాదులో తీసుకుంటే అలాంటి రోగాన్ని తగ్గిస్తుందనీ,శక్తి గుణీకరణ(పొటంటైజేషన్ ) విధానం ద్వారా మందులు తయారవుతాయనీ , మందులు చాలా శక్తివంతంగా పని చేస్తాయనీ ఎంతో ఓపికగా వివరించి చెప్పాను. ఎంత చెప్పినా,విని అంతా ట్రాష్ వాటిల్లో పంచదార, ఆల్కహాల్ తప్ప ఇంకేంవుండదు.చాలెంజ్ అన్నాడు.

అమ్మకి అల్లోపతి లో తగ్గని సైనసైటిస్ హోమియో వల్లే తగ్గింది అని చెప్తే ఆ.. దానికదే ఆ సమయానికి తగ్గి ఉంటుంది అన్నాడు. టీచర్ గారి కీళ్ళ నొప్పి కూడా హోమియో వల్లే తగ్గింది కదామరి అంటే, గాడిద గుడ్డు అది అంతకు ముందు వేసుకున్న అల్లోపతి టాబ్లెట్ ల కారణంగా తగ్గి ఉంటుందిలే పో అన్నాడు.

వీడి వరస చూస్తుంటే ఎవరైనా ఏ బెల్లం ముక్కో నోట్లో వేసుకుని తియ్యగా ఉందని చెప్తే , ఆతీపి బెల్లానిది కాదు నిన్న త్రాగిన చెరుకురసానిది అని కాని,తియ్యగా వుంది అని గట్టిగా పదే పదే అనుకున్నావు కాబట్టీ అలా అనిపించింది అని కాని అనగల సమర్ధుడనిపించింది.

ఇంక చేసే దేముంది? జాగ్రత్తగా సంభాషణను ముగించి , మనసులోనే లెంపలు వేసుకుని లేచి వచ్చేశాను.

.చిన్నప్పట్నుంచీ ఏదో ఒక అభిప్రాయంతో , నమ్మకంతో వుండిపోయి, దానిలో తృప్తిని పొందుతున్నంతసేపూ ఎంత చెప్పి, వాదించి కూడా వారిని దానికి విరుద్ధమైన అభిప్రాయంలోకి మార్చలేమని ఇలాంటి వారిని చూసి తెలుసుకోవచ్చు.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-83796451049271546542008-02-26T20:33:00.002+05:302008-02-26T21:01:57.116+05:30నా ఉదయపు నడకపొద్దున్నే నడవటం మానేసి చాలా రోజులయ్యింది. మళ్ళీ మొదలు పెట్టకపోతే ఇదో బెంగ కింద మారిపోయే అవకాశం వుంది. శీతాకాలం కావటం , చలి ఎక్కువ అవటం వలన పొద్దున్నే లేవటానికి బద్దకం ఎక్కువై నడక మానేశాను. ఇంట్లో కూడా మాటొచ్చేసే అవకాశం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇక సాకులు చెప్తే బాగోదు కాబట్టి నడక మొదలు పెడదామని నిశ్చయించుకొన్నాను. ఇలా తెల్లవారక ముందే లేవటం , నిద్రతో స్వాధీనం తప్పిన శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని బయల్దేరటం అంటే కొంచం కష్టమైన పనే. అయినా సరే కష్టమ్మీద తెల్లవారఝామునే లేచి, తయారై బయటపడ్డాను .

రోడ్డెక్కాక , అలికిడి వినపడిందో ఏమో ముగ్గేసుకుంటున్న ప్రక్క ఇంటావిడ తల పై కెత్తి చూసి మళ్ళీ వంగింది. "మళ్ళీ మొదలుపెట్టినట్లున్నాడు నడక , ఈసారి ఎన్నాళ్ళు చేస్తాడో?" అని అనుకుంటూ వుండవచ్చు బహుశా.

ఉప్పుగుంట గట్టుమీద కొచ్చేసరికి అప్పటికే హోటళ్ళు తెరిచేశారు . తెల్లారకపోయినా మనుష్య సంచారం బాగానే వుంది. రాత్రి త్రాగిన మద్యం మత్తు దిగిపోవటం వల్ల వచ్చే హాంగోవర్ ఇబ్బందులతో కాబోలు మందుబాబులు అప్పటికే సెంటరు కొచ్చేశారు, అన్వేషణ నిండిన కళ్ళతో .

ఎప్పుడూ నడిచే కలవలపల్లి రోడ్డు వైపుకి తిరిగా. కొంచంసేపటికే వీధిలైట్లను దాటేశాను. నేను మాత్రమే రోడ్డుపై మిగిలాను. ఎదురుగా ఎవరో నడుస్తున్న అలికిడి వినపడింది. నడక వేగం కొంచం పెంచి దగ్గరకెళ్ళాక చూస్తే ఆయన ఎవరో, చేతి లో చెంబుతో పరుగు లాంటి నడక తో నడుస్తున్నాడు. ప్రకృతి పిలుపు అంత బలంగా వుందన్నమాట .

కోళ్ళఫారం దగ్గరైంది. వాసన భరించలేక , వూపిరి బిగబట్టి నడక వేగం మరింత పెంచా. ఇక ఈవేగం తిరిగి ఇంటి కెళ్ళేదాకా తగ్గించకూడదని నిర్ణయించుకున్నా. చెమట వల్ల వీపుమీద చొక్కా తడవటం మొదలయ్యింది.

నాప చెరువు కు దగ్గరయ్యాను. మూడు కుక్కలూ గట్టు మీద ఎప్పటిలాగే ముణగదీసుకుని పడుకున్నాయి. నా అడుగుల చప్పుడుకి మెళకువ తెచ్చుకున్న మచ్చలకుక్క భౌ ....మంది.నల్లకుక్క మాత్రం నన్ను గుర్తు పట్టి, పడుకునే అడ్డంగా వూపుతున్న తన తోకను చూపించింది. "ఇదెప్పుడూ అంతే, కంగారెక్కువ, నువ్వేం భయపడకు " అని చెప్పాలని దీని వుద్దేశం కాబోలు .ఇంతకూ, ఊరికి ఇంత దూరంగా వున్న చెరువు దగ్గరకు ఇవి ఎందుకొస్తున్నాయో ఏమో! బహుశా ఇక్కడకు దగ్గరగా ఉన్న ఎవరి మకాంలోనైనా ఉంటున్నాయేమో మరి.

నాపచెరువు మూలదాకా నడచి, అక్కడ నుంచి వెనక్కు మళ్ళాను. అప్పుడప్పుడే తెల్లవారటం మొదలయ్యింది. వూరికి దగ్గరయ్యే కొలదీ గరువుకీ, చేలకీ వెళ్ళే వాళ్ళు ఎదురవటం మొదలయ్యింది. పరిచయం వున్నవారికోసం పలకరింపు నవ్వు మొహాన అలంకరించుకున్నాను. చెమటతో చొక్కా మూడు వంతులు తడిసి పోయింది. ఇంతలో తాడిచెట్ల వరుస దగ్గరయ్యింది. వచ్చేటపుడు చీకటి వల్లా, మంచువల్లా సరిగా కనపడలేదు కానీ, ఇపుడు తిరిగి వెళ్తుంటే బాగానే కనపడుతున్నాయి.రోడ్డు పక్క చేను గట్టు మీద రోడ్డుకి సమాంతరంగా వున్న ఈ తాడిచెట్ల వరుసను చూస్తుంటే, సైనిక వందనం చేస్తున్న సైన్యం గుర్తుకొస్తుంది నాకు. పోయేదేముంది? ఆ వందనాన్ని నేనే స్వీకరిస్తా.

ఇంటికొచ్చి టైం చూశాను. నాలుగు కి.మీ. నడక కు ఖచ్చితంగా నలభై నిమిషాలు పట్టింది. "ఫరవాలేదు ఫాం లోనే వున్నాను" అనుకున్నాను .చొక్కా విప్పి ఫాను కింద కూర్చుంటే ఎంతో హాయిగా వుంది. నడవటానికి లేవటం ఎంతో కష్టమను కుంటాం కాని నడిచి వచ్చింతరువాత వచ్చే హాయి దానికంటే ఎన్నోరెట్లు ఎక్కువ.

ఇక నుంచి నడక మానకూడదని గట్టిగా సంకల్పించుకున్నాను (ఎప్పటి మాదిరిగానే ! ).

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com4tag:blogger.com,1999:blog-1511624319044046352.post-22338691140796488312008-01-31T20:53:00.000+05:302008-01-31T21:35:05.357+05:30వ్యక్తులలో లోపాలుకొంతమంది వ్యక్తులలో , వారి వారి రంగాలలో ప్రతిభావంతులైనవారిలో కూడా కొన్ని లోపాలు తరచూ కనపడుతూవుంటాయి. ఆ లోపాల్లో అబద్దాలాడటం ఒకటి. ఇలాంటివారు ఇతర్లని సంతోషపెట్టే నిమిత్తమూ ,వారి పట్ల తమకు వున్న ఆపేక్షను తెలియజేసే నిమిత్తమూ అబద్దాలు ఆడేస్తుంటారు. ఇలాంటి అబద్దాల వల్ల ఎటువంటి ప్రమాదాలు వుండవనుకోండి.
ఉదాహరణకి దగ్గర బంధువు ఒకడు నగరంలో నివశిస్తున్నాడు. స్వంత వ్యాపారంలో బాగానే స్థిరపడ్డాడు. ఏదైనా పని
అప్పగిస్తే అది చిన్నదా ?పెద్దదా? అని చూడకుండా నాలాంటివారికి బాగానే చేసి పెడతాడు.
ఈ మధ్య నగరంలో వాడూ నేనూ కలుసుకోవటం తటస్థించింది. వెంటనే ఏరా ! బాగున్నావా? ఎప్పుడొచ్చావు సిటీ కి? ఈ మధ్య అసలు కనపడ్డం లేదు ,ఫోన్ లోనూ దొరకట్లేదు? ఈమధ్య 2,3 సార్లు ట్రై చేసాను నీకోసం అన్నాడు. అంతేకాక, నీకు పంపిన పుస్తకం అందిందా? ఇంతకూ ఎక్కడ దిగావు? ఫోన్ చేస్తే నేను స్టేషన్ కి వచ్చేవాడిని కదా! అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎంతో ఆప్యాయత కురిపించాడు. నేను మాత్రం ఆశ్చర్య పోయాను. వాడి నుంచి నాకే పుస్తకం అందలేదు సరికదా అందలేదని చెప్తే అందలేదా! ఫలానా రోజున కొరియర్లో పంపానే అన్నాడు ఇక ఫోన్ విషయం కొస్తే , నిజానికి వాడితోనే మాట్లాడటానికి 2,3 సార్లుప్రయత్నించింది నేను. సరే వాదన లోనికి పోకుండా నేను కూడా కుశల ప్రశ్నలు వేశాను. వాడు సరేరా? ఇంతకూ రేపు మధ్యాహ్నం నువ్వు ఖాళీయేనా? ఎక్కడ ఉంటావ్ ? అని వివరాలు వాకబు చేశాడు. తరువాత రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇంట్లోనే ఉంటావ్ కాబట్టి నేను వచ్చి నీతో కొంతసేపు గడుపుతాను. నీతో మాట్లాడి చాలా రోజులయ్యింది. సరదాగా గడుపుదాము అన్నాడు
మర్నాడు మధ్యాహ్నం వాడి కోసం నిరీక్షిస్తూ కూర్చున్నా. 1 గంట కాదు 2 కాదు 3 అయినా వాడు రాలేదు . కనీసం ఫోన్ అయినా చెయ్యలేదు. తరువాత ఎప్పుడో కనపడి , ఫలానా రోజున మధ్యాహ్నం నీ కోసం వచ్చాను ఎక్కడకు పోయావ్ రా కనపడకుండా? అని అడిగినా అడగగలడు వీడు.
వీడి మనస్తత్వమేమిటా అని ఆలోచించి చూస్తే , నాకేమనిపిస్తుందంటే వీడే కాదు, వీడిలాంటి వారందరూ కావాలని అబద్దాలు చెప్పరు. వీరి కప్పగించిన పనులైతే బాగానే చేస్తారు కాని చిన్న చిన్న విషయాలు మాత్రం గుర్తుంచుకోరు. ఆ మాటలు చెప్పేటప్పుడు నిజంగా చేద్దామనే
చెప్తారు. కాని వారికున్న పనుల వత్తిడిలో మర్చి పోతారు. తరువాత విషయం చెప్పి తమ అశక్తతను తెలియజెప్పే బదులు అబద్దాలు ఆడేస్తారు. ఇలాంటి వారిని మనమే సహృదయం తో అర్ధం చేసుకోవాలి. వారికి మన పట్ల వున్న అపేక్షనే గుర్తించాలి తప్ప ఇలాంటి లోపాలని కాదు.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com2tag:blogger.com,1999:blog-1511624319044046352.post-413547201377548232007-12-06T21:31:00.000+05:302007-12-06T21:44:55.100+05:30నిజాం నవాబు గారి పిసినిగొట్టుతనంప్రస్తుతం అంతా నిజాం పాలన గురించి చర్చలు చేస్తున్నారు. ఆయన పాలన లోని మంచి చెడ్డలు గురించి నాకు తెలిసింది తక్కువ కాబట్టి ఆ చర్చ లోకి పోను. అయితే , ఆయన యొక్క గుణగణాలు గురించి నాకు తెలిసిన విషయాలు వ్రాద్దామనుకుంటున్నాను.

మనం చెప్పుకుంటున్న నిజాం గారి పూర్తి పేరు "ల్యూటినెంట్ , జనరల్ , హిజ్ ఎ క్జాల్టెడ్ హైనెస్ , అసఫ్ జా ముజఫర్ ఉల్ ముల్క్ , నిజాం ఉద్దౌలా , సర్ మీర్ ఉస్మాన్ అలిఖాన్ బహద్దూర్ , ఫతే జంగ్. ఆయన కాలంలో ఆయనంత ధనవంతుడు లేడు ప్రపంచం మొత్తంలో. అలాగే పిసినిగొట్టు తనం లో ఆయనకు సాటి రాగలవారు లేరని చెప్పుకొనేవారు.

ఆయన కోశాగారం నిండా అంతులేని సంపద మూలుగుతూ వుండేది.దానిని లెక్కగట్టడం ఎవరికైనా అసంభవం అన్నట్లు ఉండేది ఆయన ఐశ్వర్యం . అంతలా సంపదతో తులతూగుతున్నా ఆయన అత్యంత నిరాడంబరంగా బ్రతికేవాడు. చివరికి ఆయనకు అత్యంత ప్రియమైన ధూమపానం విషయం లో కూడా పొదుపుగానే వుండేవారు.నవాబు గారు చైన్ స్మోకర్. అయినా వారు కనీసం యాష్ ట్రే నైనా వాడేవారు కాదు. పైగా హైదరాబాదు లోనే తయారయ్యే అత్యంత చౌక రకం సిగరెట్ చార్మినార్ నే కాల్చేవారు.

ఓసారి భారత ప్రభుత్వ సలహాదారు గా ఉన్న వి .పి . మీనన్ గారేదో రాచకార్యం పై నవాబు గారి దర్శనం చేసుకోగా నవాబు గారు ఈచార్మినార్ సిగరెట్ నే వారికి ఆఫర్ చేసారు . కాని మీనన్ మహాశయుడు మర్యాదగా వెంటనే తన జేబు లోంచి తాను వాడే ఖరీదైన అమెరికన్ సిగరెట్ల పేకెట్ తీసి నవాబు గారికి ఆఫర్ చేసారు .

అప్పుడు నవాబు గారు సంతోషించి ఒకటికి బదులు నాలుగు సిగరెట్లు ఆ పేకెట్ నుండి తీసుకుని తన సిగరెట్ కేస్ లోదాచుకుని యధావిధిగా తన చార్మినార్ సిగరెట్ నే కాల్చేసారు

మరికొంతకాలం తరువాత ఈమీనన్ గారే మరేదో పని మీద నవాబుగారిని దర్శించుకోగా , నవాబు గారు తక్షణం వారికి ఖరీదైన అమెరికన్ సిగరెట్ ను ఒక దానిని ఆఫర్ చేసారట . మీనన్ గారు అది కొన్నాళ్ళ క్రితం నవాబు గారు తన సిగరెట్ పేకెట్ నుండి తీసుకున్న నాల్గింటి లోనూ ఒకటని గుర్తించగానే పాపం దాదాపు మూర్చ పోయినంత పనయిందట .

నవాబు గారు నగరం లో ఎవరిదైనా కొత్తకారు కనిపిస్తే ముచ్చట పడిపోయేవారట. వారి సరదా చూసి వారి అంతరంగికులు తక్షణం ఆకారు వోనరుకు కబురు పంపేవారు. ఆ ఓనరేమో తన జన్మ ధన్యమైందనుకుని మరుక్షణం తన కారుని శుభ్రం గా కడిగించి మరీ నవాబు గారికి పంపేవారు.

కానీ ఆకారు మాత్రం నవాబు గారి సరదా తీరగానే సరాసరి నవాబు గారి గారేజి లోకి పయనించేది . తన కారు పంపమని అడగలేక అవతలి పెద్దమనిషి చచ్చినట్లు ఆశవదులుకునేవాడు .ఈవిధంగా నవాబు గారు తన గారేజి ఓ నాలుగు వందల కార్ల తో నింపి పారేశారు .

అలాగే నవాబు గారు వివాహాది శుభ కార్యాలకి వేటికైనా వెడితే వారేమీ బహుమతులు ఇచ్చేవారు కాదు. పైగా ఆ ఉత్సవం జరుపుకుంటున్నవారే నవాబు గారి రాకకు కృతజ్ణతా సూచకంగా విలువైన కానుకలు సమర్పించుకొనేవారు .

ఇంతా చేసి నవాబు గారి సంస్థానం ఇంగ్లాండ్ కన్నా వైశాల్యంలో పెద్దది.ఆదాయం కూడా అపరితంగానే ఉండేది. అయినా ఆయన డబ్బాశ ఆస్థాయిలో ఉండేది. ఇంకా ఎన్నో కధలు ఆయన పిసినిగొట్టు తనం గురించి ఉన్నాయి. స్వాతంత్ర్యం రాక ముందు మన దేశం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండి , ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజు ఉండేవాడు. ఆ రాజులందరి జీవన శైలి ఎలావుండేదో బాగా పరిశీలించి దివాన్ జర్మణి దాస్ అనే ఆయన "మహారాజా" పేరుతో ఒక పుస్తకం వ్రాశాడట . దానిని చలసాని ప్రసాదరావు గారు "రాజుల బూజు " గా తెలుగులోనికి అనువదించారు. ఆ పుస్తకం చదువుతుంటే ఆరాజుల వ్యవహారం ఒకింత వినోదంగానే ఉన్నా , అప్పటి ప్రజల పరిస్థితి తలుచుకుంటే కొంత విషాదంగా కూడా ఉంటుంది . దీనిలో నిజాం నవాబు గారి గుణ గుణాల గురించి చాలా ఉంది

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com5tag:blogger.com,1999:blog-1511624319044046352.post-61197170808794366902007-11-25T20:02:00.000+05:302007-11-26T20:10:39.956+05:30జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణంమనలో ప్రతి ఒక్కరికీ "భయం " గురించి అనుభవమే. జీవితం లో ఏదో ఒక విషయాన్ని గురించి భయపడనివారు ఉండరు. భయపెట్టే విషయాలు మనిషి మనిషికీ వేరు వేరుగా ఉన్నా , అందరినీ భయపెట్టే విషయం గా మాత్రం మరణం గురించి చెప్పవచ్చు . మరణభయం లేనివారు చాలా అరుదుగా ఉంటారు.

మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహ బాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను ( కూడ బెట్టుకున్న జ్ణాపకాలు , అనుభవాలు , అభిప్రాయాలు వగైరా) మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది . మరణం తరువాత మనం ఏమవుతాం ? అనే ప్రశ్నకు నమ్మకమైన సమాధానం లేకపోవటం కూడా మనలో భయానికి మరో కారణం .

మరణం పట్ల మన భయం పోవాలంటే మనలో చాలామందికి మరణం తరువాత ఏదోవిధంగా అంటే సూక్ష్మ దేహమనో , మరోజన్మ అనో ఏదో పేరుతో కొనసాగుతామని నమ్మకం కుదరాలి లేదా కనీసం మరణం తరువాత ఏమవుతుంది? అనే విషయం తెలియాలి . అంటే జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో తెలియాలి . అపుడు చావు భయం చాలా తగ్గుతుంది .

చాలావరకూ మన మతాలన్నీ ఆత్మ శాశ్వతమనీ , పునర్జన్మ అనీ , రకరకాల వివరణలు ఇస్తూ మనం శాశ్వతమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తున్నాయి . వాటిద్వారా మనం అందరికీ తెలిసున్న జీవితపు ఈవలి వొడ్డు నుండి ఉందని నమ్ముతున్న మరణం తరువాతి ఆవలి వొడ్డుకు వారధి నిర్మించుకుంటాం . ఏదో విధంగా కొనసాగుతామని నమ్ముతూ మనలో ఉండే మరణభయాన్ని తగ్గించుకుంటాం .

కానీ జిడ్డు కృష్ణ మూర్తి గారు మనం శాశ్వతమని నమ్ముతూ మరణభయం తగ్గించుకోవటం కాకుండా , ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనమూ శాశ్వతం కాదు అని చెప్పడం ద్వారా మరణ భయాన్ని తగ్గించుదామని చూస్తాడు. ఈ ప్రపంచం మొత్తంలో అన్నీ అశాశ్వతమే అయినపుడు మనం మాత్రం శాశ్వతం ఎలా అవుతాం ? అని ప్రశ్నించటమే కాక ఆయన శాశ్వతంగా ఉండటం అనే దానిలో ఉండే అవలక్షణాన్ని కూడా వివరిస్తాడు .

శాశ్వతంగా కొనసాగుతూ ఉండటం అనే దానిలోనే కొత్తదేదీ రాకపోవటం అనే అర్ధం కూడా ఉంది కదా. అలా ఏ కొత్తదనమూ లేకుండా ఎంత కాలం కొనసాగితే మాత్రం ఏమి లాభం ? అంటాడాయన . కొనసాగటం ఆగినపుడే కదా కొత్తదేదైనా ప్రవేశించటం సాధ్యపడేది? పాత విషయాలకు సంబంధించి మనం మరణిస్తే తప్ప కొత్తవీ , సృజనాత్మకమైనవీ ఏవీ మనలోనికి చేరవు. కాబట్టి మనం అంతం కావటానికి భయపడకూడదు . శాశ్వతత్వం మీద ఇష్టాన్ని ఎవరు చంపు కుంటారో వారికి మరణం పట్ల భయం ఉండదు .

సరే , ఇక జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలమా? అనే ప్రశ్నకు జె. కె. గారు తెలుసుకోగలమనే చెబుతారు. మనకు గల నమ్మకాలనూ , జ్ణాపకాలనూ , అనుబంధాలను అంతమొందించటం వీలైతే , అంటే ప్రతిదినం వాటి పరంగా మరణించటం వీలైతే , ప్రతి రేపటి దినం పునరుజ్జీవనం సాధ్యపడుతుంది . అలా చేయగలవారు మాత్రమే జీవించి ఉండగా మరణాన్ని తెలుసుకోగలరు అంటారాయన.

ఇలా మన నమ్మకాలు , జ్ణాపకాలు , అనుబంధాలతో కూడిన నేపధ్యం మొత్తాన్ని అంతం చేయటం అంటే , ధ్యానం , సమాధి మొదలైన యోగ ప్రక్రియలలో చెప్పబడే మనసుని అదుపు చేయటం , శూన్య పరచటం లాంటిదన్నమాట . అపుడు మాత్రమే మనలోనికి కొత్తదీ , సృజనాత్మకమైనదీ , సత్యం , దైవం మరేదైనా అనండి అది ప్రవేశించటానికి ఆస్కారముంటుంది . అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు దీనిని సాధించే నిమిత్తం ఎవరికీ ఏ ప్రక్రియనీ సూచించరు . ఎవరికి వారు తమ స్వంత మార్గాన్ని అన్వేషించుకోవలసిందే అంటారాయన .

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com7tag:blogger.com,1999:blog-1511624319044046352.post-48854840102430659732007-11-17T21:28:00.000+05:302007-11-18T19:42:29.292+05:30ధ్యానం యొక్క అత్యున్నత లక్ష్యం

సాధారణంగా ప్రతీ మనిషికీ తను ఉండే నిద్రావస్థ, జాగృదావస్థ ల గురించే తెలుస్తాయి. ఉదయాన్నే మేలుకోవటమే జాగృదావస్థ లోనికి వస్తాడు. రాత్రి నిద్ర పోతూ నిద్రావస్థ లోనికి పోతాడు. ఈ రెండు స్థితులు తప్ప మరోఅవస్థ గురించి తెలియదు.కాని అధ్యాత్మికవాదులు మరో అవస్థ గురించి కూడా చెబుతారు.అదే దైవీ అవస్థ. దీనినే అనంతదైవీ చైతన్యమనీ, అతీత చైతన్య స్థితీ అనీ రకరకాలుగా వర్ణిస్తారు.ఈ అవస్థ పరం గా మనమందరం ఇంకా నిద్రిస్తున్నట్లే లెక్క. ఒకవేళ ఎవరైనా ఈ స్థితి లోనికి మేలుకోవటం జరిగితే ( జ్ణాన నేత్రం తెరుచుకున్నట్లయితే ) వారికి తనే దేవుడిని అనే స్పృహ కలుగుతుంది. అంతవరకూ తను గడిపిన జీవితం అంతా నిద్ర లాంటిదని తెలుసుకుంటాడు. తన యొక్క అసలు స్వరూపం ఇదే ( పరమాత్మ ) అనీ , విశ్వమంతా తానై ఉన్నాననే నిజాన్ని తెలుసు కుంటాడు. ఈ స్థితిని పొందటాన్నే ఆత్మ సాక్షాత్కారమనీ , సత్యదర్శనమనీ రకరకాలుగా చెబుతారు. ఈ స్థితిలోనే బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. దీనిని ఎవరూ మాటలలో వర్ణించ లేరు, ఎందుకంటే ఇది మనసు పరిధిని దాటి ఉంటుంది కనుకనే దీనిని ఎవరికి వారు తమ అనుభవంలో తెలుసుకోవలసిందే.

తన స్వరూపమే ఆనంద స్వరూపమనీ , తనకు వేరుగా దేవుడు ఎక్కడో లేడనీ తనే దేవుడుననీ తెలుసు కోవటమే ప్రతీ మనిషి లక్ష్యం. ఈవిషయం ఎవరికి తెలిసినా , ఎవరికి తెలియకపోయినా అందరి ప్రయాణం అటే.ఈ జన్మ లో కావచ్చు లేదా మరికొన్ని జన్మల తరువాతైనా కావచ్చు. ఆలక్ష్యాన్ని చేరుకోవలసిందే.

ఆ స్థితిని ప్రయత్నంతో అనుభవం లోనికి తెచ్చుకోవాలంటే చపలమైన చిత్తానికి కళ్ళెం వేయాలి. మనసుని నిశ్చలం చేయాలి. లక్ష్యాన్ని ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనలోదైవ ప్రకాశం పొందటం కోసం అడ్డుగా వున్న మనసు అనే తెరను తొలగించాలి. ఇవన్నీ ధ్యాన యోగం తో సాధ్యపడతాయి. మన ప్రాచీన మహర్షులు ఆత్మసాక్షాత్కారం కోసం ధ్యాన యోగమే కాక ఇంకా భక్తి యోగమనీ, కర్మ యోగమనీ , రాజ యోగమనీ ఇంకా ఎన్నో మార్గాలు చెప్పారు. అన్ని మతాల సారమూ ఈస్థితి లోనికి మేలుకొమ్మనే .

దైవ సాక్షాత్కారమనేది మనిషి చేసే కృషిని బట్టి ఉంటుంది. ఈ విషయమ్మీదే దృష్టినంతా ఏకాగ్రపరచి కఠోర ధ్యానం ( తపస్సు ) తో గడపితే చాలా త్వరగానే భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు . లేదా చిత్త శుద్ది కరవైతే కొన్ని జన్మలే ఈ ప్రయత్నం లో ఖర్చయిపోవచ్చు.

ధ్యానం , సమాధి వగైరా ఆధ్యాత్మిక సాధనల వల్ల బి పి , అల్సర్లూ , టెన్షన్ లూ తగ్గుతాయనీ , మెదడు చురుకుదనం పెరుగుతుందనీ , అయిడియాలు బాగా వస్తాయని ఇలా చాలా చిన్న చిన్న విషయాలను మాత్రమే గుర్తిస్తున్నారు. కానీ ధ్యానం వగైరా సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని తెలుసుకోవాలి. ఆచరించాలి.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com2tag:blogger.com,1999:blog-1511624319044046352.post-68620785703880053372007-11-11T20:49:00.000+05:302007-11-11T21:15:26.307+05:30గురజాడ గారి "పెద్ద మసీదు""కన్యాశుల్కం " రచయితగా గురజాడ అప్పారావు గారి గురించి తెలియని వారు ఉండకపోవచ్చు . ఆయన కేవలం కొన్ని నాటకాలు వ్రాయటానికే పరిమితం కాలేదు . కొన్ని కధానికలు కూడా వ్రాశారు . ఈ విషయం కొంత మందికి తెలియదు . అయితే అవి అముద్రితాలు. ఆయన చనిపోయిన తరువాత ఆయన వ్రాసుకున్న డైరీ లు , వ్రాత ప్రతులూ , కాగితాలలో బయటపడిన , ముద్రణ కోసం సిద్దం చేసుకున్నట్టు గా ఉన్న , వేళ్ళ తో లెక్కించగల్గిన కొన్ని కధలలో ఈ "పెద్ద మసీదు" కధ ఒకటి.ఆయన వ్రాసుకున్న ఊహలూ , ఆలోచనలలో అనేక కధలకు సరిపడే ముడి సరుకు ఉంది . ఇంకొంత కాలం బ్రతికి ఉంటే అవన్నీ ఎన్నో మంచి కధలుగా రూపు దిద్దుకుని ఉండేవి .
ఈ "పెద్ద మసీదు" కధని చదివిన కొందరు అసంపూర్తి రచన అనీ , ఇంకా వ్రాయవలసింది ఉండి ఉండవచ్చు అనీ అభిప్రాయపడ్డారట .ఇంతకూ కధ ఏమిటంటే ఒక పండితుడు ఉంటాడు. చాలా ఏళ్ళు కాశీ లో గడిపి ఒక శిష్యుడు తో స్వగ్రామం వస్తాడు . దూరం నుంచే కనపడే ఆ గ్రామ దేవాలయ గోపురం కనపడక పోయేసరికి కంగారు పడతాడు . అ స్థానంలో ఓ పెద్ద మసీదు గోపురం కనపడుతుంది . ఆశ్చర్యం నుండి తేరుకుని మశీదు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ఇమాం ను సంప్రదిస్తారు . ఆ ఇమాం బండగా , ముక్తసరిగా కసిరినట్లుగా మాట్లాడుతాడు . చాలా బాధ కలిగిన పండితుడు వెనక్కు పోదామని నిర్ణయించుకుంటాడు . కానీ శిష్యుడు వారించి కనీసం ఆవీధి లోనే ఉండే తమ బంధువుల వివరాలైనా తెలుసుకోమని సలహాచెప్తాడు. సరేనని తమాయించుకుని ఇమాం ద్వారా బంధువుల విచారణ చేస్తాడు . తద్వారా ఈ ఇమాం తన మేనల్లుడే అని తెలుసుకుంటాడు . ఇద్దరూ ఆనంద పరవశులై పరస్పరం కౌగలించుకుంటారు .
ఈ కధానిక చదివిన తరువాత ఏమాత్రం బుర్ర ఉన్న వాడైనా అసంపూర్ణం అనగలడని అనుకోను . ఏ కాలానికైనా అంతర్జాతీయ కధానికా సంకలనాల కెక్కాల్సిన స్థాయి దీనిది . ఇంతటి శక్తి వంతమైన కధని ఆయన కేవలం 500 లోపు పదాలలో , అదీ సుమారు 100 సంవత్సరాల క్రితం వ్రాశారు. మతం కన్నా రక్తసంబంధం గొప్పదనే సందేశాన్ని మనసుకి హత్తుకునేలా చెప్పారు . ఈ కధకి ఒక్క వాక్యం కలిపినా , కనీసం ఒక పదం కలిపినా కధ పాడవుతుందేమో అనిపిస్తుంది.
సాహిత్య అకాడమీ వారు భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించిన శ్రేణిలో నార్ల వెంకటేశ్వర రావు గారు ఆంగ్లంలో వ్రాసిన
"గురజాడ"అనే పుస్తకం లో అప్పారావు గారి అముద్రిత రచనల (డైరీలు , వ్రాతప్రతులు వగైరా ) గురించి చదవవచ్చు. దీనిని కేతు విశ్వనాధ రెడ్డి గారు అదే పేరుతో తెలుగు లోనికి అనువదించారు .

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-77337139387928749302007-11-06T21:02:00.000+05:302007-11-06T23:22:58.781+05:30వాడే(పోలీస్)వీడు(దొంగ)ఈమధ్య ఒక డి.ఎస్.పి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడని వార్త వచ్చింది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే ఉండాలి.నేరాలను అరికట్టాల్సిన పోలీస్ ఆఫీసర్ దొంగతనం నేరంపై అరెస్ట్ కావడం విశేషమే మరి . ఇతను అసలు పోలీస్ శాఖలో చేరక ముందే నేర పూరిత మనస్తత్వం కలవాడై ఉంటే సరే, కాని కొంత మంది పొలిసు శాఖ లొ చేరక మనుపు చాలా నిజాయతీ పరులు కూడా చేరిన తరువాత నేర ప్రవృత్తిని అలవరచుకుంటారు . మానసిక శాస్త్ర పరంగా ఇది మరీ విడ్డూరం ఏమీ కాదు అలా జరగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ క్రమం ఎలా ఉంటుందంటే నేర ప్రవృత్తి పట్ల అసహ్యం వ్యక్తం చేసేవారు సైతం పోలీస్ శాఖ లో చేరింతరువాత తమ వృత్తిలో భాగంగా నేరస్తులతో కలసి సంచరించటం జరుగుతుంది తప్పదు కదా . అప్పుడు వీరిపట్ల అంతకు ముందు ఉన్న
అసహ్యం స్థానం లో ఆసక్తి తో కూడిన పరిశీలన మొదలవుతుంది.
నేరాలు ఎలా జరుగుతాయి ? ఎందుకు జరుగుతాయి ? ఫలితం ఏమిటి ?
అనే విషయాలమీద . ఈ పరిశీలన దశ దాటిన తరువాత నేరస్తుల పట్ల సానుభూతి మొదలవుతుంది. తరువాతి దశ వాడిస్థానం లోఉంటే తానేమి చేస్తాడు? అని అంచనా వేసుకుందుకు ప్రయత్నిస్తాడు. పరకాయ ప్రవేశం లా అన్న మాట.
తరువాత దశ ఇంకేమి ఉంది ? మనసులో అంచనా వేసుకునే బదులు స్వయం గా ఒక నేరం లో పాల్గొని చూస్తాడు.
దాని తరువాత అదే అలవాటవుతుంది. వాడు వీడు అవుతాడు.
6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు అనటం లో అర్ధం ఇదే.
దొంగనోట్ల మార్పిడి, ల్యాండ్ మాఫియా గ్యాంగులూ వగైరా చట్ట వ్యతిరేక కార్య కలాపాలలో ఎక్కువగా మనం పోలీస్ ల పాత్ర చూస్తుంటాము. కొన్ని నేరాలలో వీరి పాత్రే ప్రధానంగా ఉండటం కూడా మనం చూస్తుంటాం. కారణం సావాస దోషమే. అయితే అందరు పోలీసులు ఇలాగ తయారు అవ్వాలని ఏమీలేదు.
ప్రతి మగవాడిలోనూ ఆడ హార్మోన్లు , ప్రతి స్త్రీ లోనూ మగ హార్మోన్లూ ఉండటం ఎలా సామాన్యమో అలాగే ప్రతి వారి లోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. పరిస్థితులని బట్టి, వ్యక్తిని బట్టి ఆయా గుణాలు ప్రేరేపించబడతాయి. తదనుగుణంగా మనిషి తయారవుతాడు.
వాడు వీడుగా అవటానికి పోలీసే కానక్కరలేదు. మామూలు మనుషులైనా సరే ఇలా మారిపోయే అవకాశం ఉంది.
అయితే పోలీస్ లేఎక్కువ మారుతారు ఎందుకంటే నేరస్తులతో ఎక్కువ సహవాసం వీరికే తప్పనిసరి కాబట్టి.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com5tag:blogger.com,1999:blog-1511624319044046352.post-70044076696852640662007-11-01T22:10:00.000+05:302007-11-06T23:54:55.611+05:30కష్టాలన్నీ మంచివారికేనామామూలుగా మనకు సామాన్యులు ,చెడ్డవాళ్ళు ఏదో పద్దతిలో సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తారు .కాని మనం మంచివాళ్ళు ,నీతిమంతులు అని చెప్పుకునే కొందరు ఎక్కువ కష్టాలు పడుతూ కనపడుతుంటారు . ఎందుకని ? ఇది నిజమేనా ? మన అపోహా ? నాకైతే నిజమే అనిపిస్తుంది.
ఎందుకంటే, ఈ ఆధ్యాత్మికవాదులూ , మంచివాళ్ళూ, మామూలు విషయాలకు ఫ్రాధాన్యం ఇవ్వరు. వాళ్ళ దృష్టి అంతా శాశ్వతానందం మీదా, అలౌకిక విషయాలమీదా వుంటుంది. అందుకనే వీరు ప్రాపంచిక విషయాలలో (సామాన్యులకువలే ఆస్తులూ, సౌకర్యాలూ వగైరా సమకూర్చుకోవటం లో) లౌక్యంగా వ్యవహరించడం మీద శ్రద్ద చూపరు. అందుచేతనే దైనందిన వ్యవహారాల్లో ను, వివిధ సామాన్య విషయాల్లోను వీరు వెనకపడి పోతూ వుంటారు.తద్వారా కష్టాలు తెచ్చుకుంటారు. ఇది మనం అంగీకరించాలి.
ఒక మంచివాడు, చెడ్దవాడు పేకాటో, చదరంగమో ఆడుతున్నారనుకోండి. ఎవరు గెలుస్తారు ?నిస్సందేహంగా ఆట ఎవరికి బాగా వచ్చో వాడే గెలుస్తాడు. మంచివాడే గెలవాలి చెడ్దవాడు వోడిపోవాలంటే కుదరదు మరి . మంచివాడైనా మహాత్ముడైనా తను పాల్గొనే ఆట ఎలా ఆడాలో తెలియకపోతే ఓడిపోక తప్పదు. ఆట గెలవటానికీ, అతని మంచితనానికీ సంబంధమే లేదు.
ఇంతకూ బయట నుంచి చూసే మనం , వారు పొందుతున్నారనుకొంటున్న కష్టం అంత తీవ్రంగాను తమలోతాము వాళ్ళూ పొందుతారా? అని. ఏ మాత్రం పొందరు. ఎందుకంటే. ఇలాంటి చిన్న చిన్న కష్టాలు, వైఫల్యాలు, నష్టాలు వారినేమీ చేయలేవు.వారు విజయాలకు పొంగి పోరు, ఓటములకు కృంగిపోరు.కారణం వారి దృష్టి ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com3tag:blogger.com,1999:blog-1511624319044046352.post-60922884974808754732007-10-29T22:31:00.000+05:302007-10-29T22:52:07.689+05:30మహాపండిత రాహుల్ సాంకౄత్యాయన్--బహు భాషా పాండిత్యంమనలో చాలా మందికి ఒక భాషో రెండుభాషలో తెలిసివుండటం జరుగుతుంది. దేశమంతా తిరిగే వారికి మహా అయితే 6,7 భాషలలో ప్రవేశం ఉండవచ్చు. కాని కొంతమంది మహా పండితులు వుంటారు. వారికి కొన్ని పదుల సంఖ్యలో భాషలలో పాండిత్యమే ఉంటుంది. అలాంటి కొందరిలో మన తెలుగువారు పి.వి నరసిం హారావు గారు ఉంటారు . ఇంకా కొందరిలో మన దేశ ప్రముఖ రచయిత మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్. ఈయన పేరు సాహిత్యంతో సంబంధం వున్నవారందరికీ చిర పరిచితమే. ఈయన హిందీలో వ్రాసిన " వోల్గా సే గంగ" అనే గ్రంధం దగ్గర దగ్గర నలభై భాషలకి అనువదింప బడింది . ఈయన ప్రపంచం అంతా సంచరించారు. ప్రపంచమంతా మాట్లాడే భాషలు సుమారుగా మూడువేల వరకూ ఉంటాయి . వాటిని పది కుటుంబాలుగా విభజించారు. వాటిలో చాలా భాషా కుటుంబాలతో ఈయనకి ప్రవేశం వుంది. సంస్కృతం ,పాళి భాషల్లో ఈయన మహా పండితుడు. బౌద్ద సాహిత్యంలో ఈయన పట్టు ఎంతటిదంటే ఆయన జీవించిన కాలంలోనే కాదు ఇప్పటి వరకూ కూడా ఈయనను మించిన వారు లేరు అని చెబుతారు. బౌద్ద సాహిత్యాన్ని ఈయన రష్యన్ భాషలోనికి అనువదించారు. ఈయనకు "త్రిపిటకాచార్య"అనే బిరుదు కూడ వున్నది.
ప్రపంచ భాషలే కాక, మనదేశంలో మాట్లాడే భాషలు కూడా ఈయనకు చాలా వచ్చు . ఒకసారి మన తెలుగు వారైన డా.సంజీవ్ దేవ్ (ఈయన కూడా రచయిత,కవి,చిత్ర కారుడు, ప్రసిద్ధ కళా విమర్శకుడు) రాహుల్ సాంకౄత్యాయన్ ని మనరాష్ట్రాని కి ఆహ్వానించటం జరిగింది. ఆయన సంజీవ్ దేవ్ స్వగ్రామమైన తుమ్మపూడి వచ్చారు. 4,5 రోజులు మనరాష్ట్రంలోపర్యటించారు.
ఒకరోజు బౌద్ద చారిత్రక ప్రదేశాలయిన అమరావతి, నాగార్జునకొండ వగైరా, వగైరా ప్రాంతాలన్నీ పర్యటన చేయటానికి వెళ్ళారు. మధ్యలో ఒక చోట చెట్ల క్రింద విశ్రమించారు. ఆ ప్రక్కగా కొంతమంది లంబాడి తండావారి నివాసాలు కూడా వున్నాయి. వారుకూడా అక్కడేవుండి వారి భాషలో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. రాహుల్ సాంకౄత్యాయన్ వారి మాటలను కొంతసేపు శ్రద్దగా గమనించారు. తరువాత వాళ్ళతో వాళ్ళ భాషలోనే మాట్లాడటం ప్రారంభించారు. సంజీవ్ దేవ్ గారి ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకంటే వారి భాషకు అసలు లిపి లేదు, పేరు లేదు. అది వారిలో వారు మాట్లాడుకునే భాష మాత్రమే. వేరెవరికి అర్ధంకాదు.
తర్వాత సంజీవ్ దేవ్ గారు ఆశ్చర్యంగా అడిగారు. ఇది మీకెలా సాధ్యమైంది? అని. అప్పుడు ఆయన "వారి మాటలను గమనించటం ద్వారా గుజరాత్ ,రాజస్థాన్ ల సరిహద్దు ప్రాంతాన్నించి వారు వచ్చారనీ, ఆ రెండుభాషలనూ వీరు సంకరం చేసి మాట్లాడుకుంటున్నారనీ గమనించాను. వారికి వలెనే ఆభాషల్లో ని క్రియాపదాలను అపభ్రంశం చేసి మాట్లాడాను. అందుచేత వారికి అది అర్ధమైంది." అని చెప్పారు.
అదీ అయన భాషా ప్రజ్ణ. ఈ విషయాన్ని రాహుల్ సాంకౄత్యాయన్ తో తనకున్న అనుభవాన్ని వివరిస్తూ సంజీవ్ దేవ్ గారు ఒకచోట వ్రాసారు.
ఇంతకూ విషాదం ఏమిటంటే ఇంతటి ప్రజ్ణా శేలి, మహా పండితుడు, బహుభాషా కోవిదుడు జ్ణాపక శక్తిని పూర్తిగా కోల్పోవడమే ప్రధాన లక్షణం గా గల వ్యాధితో మరణించారు. తన పేరును తానే మరిచిపోయేంత మతిమరుపు అది. జీవిత చరమాంకం లో ఏ రెండు పదాలనూ అర్ధవంతమైన క్రమంలో మాట్లాడలేక పోయారు.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com2tag:blogger.com,1999:blog-1511624319044046352.post-62685992209440577592007-10-25T20:05:00.000+05:302007-11-09T16:17:00.173+05:30అంతా మన మంచికేకొన్ని సంఘటనలలో మన పొరపాట్లు లేకపోయినా, మనసుని పాడుచేసే సందర్భాలు ఎదుర్కోవలసి రావటం అనేది ఎవరికైనా అనుభవమే.
రోజువారీ కార్యక్రమాలలో అనుభవమయ్యే కష్ట నష్టాలు, అవమానాలు, కలతలు, నలతలూ మన మనసులను అప్పుడప్పుడు పాడు చేయటం సహజంగా జరుగుతూనే వుంటుంది. కాని వాటిని వేటికవి విడదీసి చూసుకుని సంకుచితంగా విశ్లేషించుకుని బాధపడటం తప్పు. అలా చిన్న చిన్న వాటికి అతిగా స్పందించటం మాని, ఇంకా పైస్థాయి నుంచి వాటిని అవగాహన చేసుకుంటూ, వాటి పరమార్ధం ఏమైవుండవచ్చో గ్రహిస్తూ, వాటి వలన జరుగబోయే మంచిని అంచనా వేయాలి. అలా ముందుకు సాగాలి.
గతంలో మనల్ని బాధపెట్టిన అనేక సందర్భాలను గుర్తు తెచ్చుకుంటే వాటివలన తదనంతర కాలంలో మనకు జరిగిన మంచి, మనలో వచ్చిన మంచిమార్పులు ఎవరైనా గుర్తించవచ్చు. మనం ఎదుర్కొనే కష్టాలు, అపజయాలు మనలను మరింత బలంగా తయారు చేస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఈ పరిస్థితులన్నీ గతంలో మనం చేసిన పనుల ఫలితాలే. మనం అనుభవించక తప్పదు. మనం గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం "జరిగిందంతా మంచే, జరగుతున్నదీ మంచే, జరుగబోయేది మంచే".

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-22562086181752922312007-10-22T22:16:00.000+05:302007-11-11T20:15:45.661+05:30

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-46742683553992383992007-10-20T23:11:00.000+05:302007-11-09T16:24:31.650+05:30రిపార్టీపూర్వం అహంకారం పాలు కొంచెం ఎక్కువైన యువరాజు ఒకడు తన రాజ్యంలోనే వేరే నగరంలో జరుగుతున్న తిరునాళ్ళుచూడటానికి వెళ్ళాడు. అక్కడ జనసందోహంలో ఒక మనిషిని ఇంచుమించు తనను పోలిన, తన వయస్సు తోనే ఉన్న యువకుడిని చూడటం తటస్థించింది.
తన తండ్రి శృంగారప్రియత్వం బాగా తెలిసిన వాడవడం చేత, ఈ మనిషి మీద యువరాజుకి చులకన భావం ఏర్పడింది. తన తండ్రి వలననే ఈ యువకుడు పుట్టివుంటాడని యువరాజు అనుమానం. అయినా అనుమానం నివృత్తి చేసుకోవటం కోసం ఆ మనిషిని దగ్గరకు పిలిచి అడిగాడు. "ఏమోయ్ ఏ ఊరు నీది? "అని, అతను "ఈ ఊరే యువరాజా" అని సమాధానమిచ్చాడు అంతట యువరాజు, "మీ అమ్మ గతంలో ఎపుడైనా రాజధానిలో ఉండేదా? " అని అడిగాడు.
ఈ ప్రశ్నలో గూఢార్ధాన్ని ఆ వ్యక్తి గమనించాడు. ఏమైనా యువరాజుకి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతనప్పుడు ఇచ్చిన సమాధానం. "లేదండి, మా అమ్మ ఎప్పుడూ రాజధానిలో ఉండలేదు కానీ మా నాన్న మాత్రం నేను పుట్టక క్రితం రాజధానిలోనే ఉండేవాడట."
అంతే యువరాజు ముఖం ఎలా ఉంటుందో ఊహించండి.
ఈ రిపార్టీ ఎప్పుడో ఎక్కడ చదివానో గుర్తులేదు కాని నాకు చాలా బాగానచ్చింది. మరి మీకూ?

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0tag:blogger.com,1999:blog-1511624319044046352.post-82935520648385195522007-10-17T20:15:00.000+05:302007-11-09T16:26:15.368+05:30డబ్బు ప్రాధాన్యతప్రతి మనిషికీ ఎన్నో అవసరాలు వుంటాయి. వాటిల్లో చాలా వాటిని డబ్బుతో సమకూర్చుకోవచ్చును. కానీ అన్నీ డబ్బుతో సమకూడవు. ముఖ్యంగా ఆనందం , సంతోషం కేవలం డబ్బుతో సంపాదించలేము. కానీ చాలామంది పొరపాటు అవగాహనతో డబ్బుకు లేనిపోని ప్రాధాన్యతనిచ్చి, దాని సంపాదన కోసం తమకు అనేక రంగాల్లో వున్న ఆసక్తులను, అభిలాషలను చంపుకొని శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నారు.
ఏ రంగంలో అయినా మనం తీవ్రంగా కృషి చేస్తే ఆ రంగంలో విజయం సాధించటం సహజంగా జరిగేదే. అలా ఒకవేళ విజయం సాధించి డబ్బు సంపాదించినా ఆనందం ,తృప్తిని పొందుతారని గ్యారంటీ ఏం లేదు. అనుకున్నంత సంపాదించి దానితో అన్నిరకాల సౌకర్యాలూ సమకూర్చుకునీ కూడా పొందామనుకున్న ఆనందాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేరు. చాలా త్వరగానే మామూలైపోతారు. మళ్ళీ పరుగు , క్రొత్తకోరికలు తీర్చుకోవటం కోసం. ఎక్కువ సంపాదిస్తే , జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చుననుకుంటారు కానీ కరెక్ట్ మాత్రం కాదు. కడుపు కాలుతున్నపుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ, కడుపు నిండినతరువాత సంపాదించే ఏ పది రూపాయలకీ ఉండదు. ఇది అందరికీ అనుభవమే. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా వుండేవాడికి డబ్బుతోనూ, సౌకర్యాలతోనూ పనేలేదు.

ఇక్కడ ఒక చిన్న కధ.

తీరికదొరికిన కోటీశ్వరుడైన వ్యాపారి ఒకడు తీరం వెంట వెళుతున్నాడు. అక్కడ ఒక జాలరి వలను ప్రక్కనబెట్టి చెట్టుక్రింద హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సంతోషంగా కూనిరాగాలు తీస్తున్నాడు.జాలరి అంత సంతోషంగా ఉండటం చూసిన వ్యాపారికి అతనితో మట్లాడాలనిపించింది.దగ్గరికి పోయి మాట కలిపాడు . వారిమధ్య సంభాషణ ఇలా సాగింది.

వ్యాపారి:ఏమోయ్ ఏ రోజేం పనిలేదా?

జాలరి :చేపలు పట్టడం , అమ్మటం అయిపోయిందండి. పని అయిపోయిందిగదాని విశ్రాంతి తీసుకుంటున్నాను. వ్యాపారి: పని అయిపోవటం ఏమిటి? ఇంకా చేపలు పట్టవచ్చుకదా?
జాలరి : ఇంకాఎందుకండీ?

వ్యాపారి: ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా?

జాలరి : ఇంకా సంపాదించి ఏం చేయాలండీ?

వ్యాపారి: ఏంచేయాలి అంటావేం పిచ్చివాడా? స్వంతంగా పడవ కొనుక్కోవచ్చు. ఇంకా మనుషులను పెట్టుకొని, ఇంకా ఎక్కువ చేపలు పట్టవచ్చు.ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
జాలరి : అప్పుడు?

వ్యాపారి: ఇల్లు కొనుక్కోవచ్చు.

జాలరి : తర్వాత?

వ్యాపారి: ఇంకా సంపాదించి, టివి, కారు, ఫ్రిజ్ వగైరా కొనుక్కోవచ్చు.
జాలరి : అప్పుడేమవుతుంది? వ్యాపారి: నువ్వు ఆనందంగా , సంతోషంగా జీవించవచ్చు.
జాలరి : అలాగా! అయితే ఇపుడు నేను చేస్తున్నదేమిటండీ? ఇపుడు నేను ఆనందంగానే వున్నాను కదా? అవన్నీ చేయకపోతే నేను సంతోషంగా వుండనని మీ ఉద్దేశ్యమా? వ్యాపారి నిర్ఘాంతపోయాడు.
మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు, సౌకర్యాలు వున్నాయన్న దానిమీద మనసంతోషం అధారపడదు. పై కధ చదివింతర్వాత ఇదేదో అభివృధ్ధికి వ్యతిరేకం , సోమరివాళ్ళకి అనుకూలం అనుకోవచ్చు. అలా అర్ధం చేసుకోకూడదు. అభివృధ్ధి అవసరమే. కాని అది ఎవరికి? ఎంతవరకు? అనేది ఎవరికి వారు విజ్ణతతో తెలుసుకోవలసిన విషయం. అందరికీ అన్నీ అవసరం కావు. మనిషి మనిషికీ ప్రాధామ్యాలూ ,అవసరాలూ మారుతూ వుంటాయి. "ఆలశ్యం అమృతం విషం" అనిచెప్పిన పెద్దలే "నిదానమే ప్రధానం" అని కూడా చెప్పారు. రెండూ పరస్పర విరుధ్ధంగావుంటాయి. రెండూ కరెక్టే కాని ఎవరికి వారు ఏ ఏ సందర్భాల్లో వీటిని అన్వయించుకోవచ్చు అనేది వారి వారి విచక్షణని బట్టి వుంటుంది. డబ్బు సంపాదన విషయం కూడా అంతే.

అసలు మంచి సంగీతం వింటూ ఆనందించటానికీ, ప్రకృతి అందాలని ఆస్వాదించటానికీ, భార్యాపిల్లలతో సంతోషంగా గడపటానికీ, ఇష్టమైనపుస్తకం చదువుతూ ఆనందించటానికీ డబ్బుతో పనేముందీ?

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com1tag:blogger.com,1999:blog-1511624319044046352.post-8859222785586693582007-10-08T20:33:00.000+05:302007-10-08T21:03:52.393+05:30రవీంద్రనాధ్ టాగోర్ సర్ ప్లస్ థీరీప్రతీ మనిషికీ అనేక రకాల భావాలు వస్తుంటాయి. అతను భరించగలిగిన పరిధిలో వచ్చే భావాలు అతనిలోనే జీర్ణమైపోతాయి.తన పరిధికి మించి తను తట్టుకోలేనంతటి భావాలు వస్తే మాత్రం మరుగుతున్న పాలు పొంగిపోయినట్లు వెల్లువలా ఇవతలకు వస్తాయి. అలా వచ్చే అదనపు భావావేశమే కవితగానో, గానంగానో, శిల్పంగానో మారుతుంది. మనం చూసే కళలన్నీ అలా ఏర్పడినవే.

రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.com0